ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ తేదీ ఆదివారం కావడంతో ఆగస్టు 31వ తేదీనే లబ్ధిదారులకు ఇబ్బందు లేకుండా ముందస్తుగా పింఛన్ల అందజేస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎప్పుడు ముందస్తుగా పెన్షన్ల పంపిణీ జరగలేదని ఈ ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కే సాధ్యమైందని తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం 39,332 పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారని, వారికి ప్రతినెల 16 కోట్ల 85 లక్షలు 79 వేలు ప్రభుత్వం అందచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు పేదల కోసం 5/- కే అన్నా కాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారని తెలియచేసారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలలో భాగంగా నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసారు. అంతే కాకుండ సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి పొలాలకు వెళ్లే దారులుకు, స్మశాన వాటికల దారులకు 140కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్టు తెలియజేశారు. ఈ ప్రతిపాదనలు మంజూరు అయిన వెంటనే ప్రతి గ్రామ నందు పొలాలకు,స్మశాన వాటికకు వెళ్లే గ్రావెల్ రోడ్డులను నిర్మిస్తాము అని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చెర్మన్ 786 రఫీ , యువనాయకులు నెలవల రాజేష్, మాజీ నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ మైలారి శోభరాణి, మైలారి రాజశేఖర్, మండల టిడిపి నాయకులు, అధికారులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ముందస్తుగా పింఛన్ల నగదు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే…సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ
Related Posts
క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read moreప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానంవిద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనంపాఠశాల విద్యలో మార్పు కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట విద్యాశాఖ డైరెక్టర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి, చిత్తూరు…
Read more