బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): జగన్మోహన్ రెడ్డి మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని మర్డర్ చేస్తే ఆరోజు ధర్నా చేశారా ?? మీ వైసీపీ నాయకుల వల్ల కావలిలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే ఆరోజు ధర్నా చేశారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీ ని దారుణంగా కొట్టి ఆధారాలు లేకుండా చేసిన ప్రభుత్వ మీది కాదా! అని ప్రశ్నించారు.నేను ధర్నా చేస్తే, నిలదీస్తే నా మీదే 10 కేసులు పెట్టారు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ మండిపడ్డారు. మీ ప్రభుత్వంలో మా బాబాయ్ ని ఎవరు చంపారు ఎందుకు చంపేరు అని ధర్నా ఎందుకు చెయ్యలేదు? అని నిలదీశారు. రాష్ట్రమంతా దేశమంతా తెలుసు మీ బాబాయిని ఎవరు మర్డర్ చేశారో వాళ్లకే మీరు ఎంపీ టికెట్ ఇచ్చారనీ , మున్సిపల్ మంత్రి నారాయణని ఎన్నికల ముందు ఏ విధంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ముఖ్యమంత్రి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ ని కూడా ఆఖరికి వైజాగ్ వస్తే పోలీసులతో ఏవిధంగా నిర్బంధించివో అందరికీ తెలుసు అన్నారు.రిషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాం ,ధనాన్ని ఎంత దుర్వినియోగం చేసావో,ఈ రాష్ట్రా అభివృద్ధి నీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేవనీ ప్రజలందరూ గమనించి నీకు సరైన గుణపాఠం చెప్పాలని విమర్శించారు. నిన్న అసెంబ్లీలో మద్యం మీద శ్వేత పత్రం విడుదల చేస్తే , దాంట్లో లక్ష కోట్లు మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగిందన్నారు ఈరోజు చిన్నచిన్న షాపుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడుతుంటే నువ్వు క్యాష్ తీసుకున్నావ్ అని లక్ష కోట్ల రూపాయలు లో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిన పరిస్థితిని చూశాం ఆన్నారు. ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇల్లులు అన్ని మీ కార్యకర్తలు ఇచ్చుకొని. ఎక్కడ చూసినా ఇసుక, గ్రావెల్ ,మైనింగ్ అన్ని దోచుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి నీతి గా నిజాయితీగా చేస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అబాసపాలు చేయాలని చూస్తున్నారు .ఈ విధంగా చేస్తే మీకే శిక్ష పడుతుందన్నారు. వినుకొండలో వ్యక్తిగత మర్డర్ ని ఎన్ డి ఏ పార్టీకి ఆపాదించి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నావ్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వందల మర్డర్లు చేయించారు ,మేము ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అడుగుతా ఉన్నాము. సింహం సింగిల్గా వస్తది అంటూ చెప్పి నిన్న ఢిల్లీలో అందరి పార్టీ లమద్దతు కోరుతూ ఉన్నావు.. మీ అక్క చెల్లెలు ఇద్దరికి ఏమైనా న్యాయం చేసేవా ? అని మండిపడ్డారు. కడప ఎంపీ అవినాష్ ని వెంటనే అరెస్ట్ చేయాలని జగన్ ని శిక్షించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి నమామిగంగే కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా కార్యదర్శిలు చిలకా ప్రవీణ్ కుమార్ ,దాసరి ప్రసాద్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ ముని సురేష్ కోకన్వీనర్, పిడుగు లోకేష్, ఇరిగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదు జగన్
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more