సరిహద్దులు దాటిన అవినీతి
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..
ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి):ఖరీదైన కారులో రాకపోకలు కమ్మన మాటలతో కలుపుగోలుతనం.. నాయకులు ముందు అతి వినయ విధేయతలు… అవకాశం ఉండి మైకు చేతికి ఇస్తే.. పొగడ్తలతో ముంచి వేయడం… అతనికి వెన్నతో పెట్టిన విద్య.. తన మాటల గారడితో అవతల వ్యక్తులను బూరెడి కొట్టించి అంత తానే తాను ఏమని చేయగలనని నమ్మించడంలో తనకు తాను చాటి… అధికార పార్టీ ఏదైనా ప్రైవేటు సంస్థలలో పెత్తనం చెలాయించే విధంగా, చెల్లుబాటు అయ్యే విధంగా తనకు నచ్చిన అన్ని విద్యలు ప్రదర్శించడం అతని నైజం. చూపు అమాయకంగా కనిపించిన.. చేతల్లో మాత్రం తాను చేసే పని మరో చేతికి తెలియకుండా అంటకుండా తనొక్కడే తన సామాజిక వర్గానికి లీడర్ అంటూ అధికారం ముందు ఫోజులు కొట్టడం అతని రాజకీయ చతురతకు నిదర్శనం. ఇవన్నీ పైన కనిపించే హావభావాలే.. లో లోపల ఇతని వ్యవహార శైలి మేడిపండే… సందర్భాన్ని అవసరాన్ని బట్టి ఇతను ఊసరవెల్లి వ్యవహారాలు చేయడంలో ఇతనికి ఎవరు రారు పోటీ సాటి… ఓ కుగ్రామంలో ఉండే ఈ వ్యక్తి విద్యార్థి దశ నుండే ఇతని అవినీతి దందాలు అందరికీ తెలిసినవే.. తాజాగా మరో సంఘటన ఓజిలి మండలానికి చెందిన ఓ చోటా నాయకుడు అవినీతి హద్దులు దాటుతుంది. అధికార పార్టీని అడ్డుపెట్టుకొని కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాన్ని పరోక్ష బెదిరింపులకు పాల్పడుతూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. పైకి పెద్దమనుషుల ఫోజులు కొడుతూ ప్రజాప్రతినిధుల మీటింగ్ ఉన్నాయంటూ వాటి నిర్వహణకు నిధుల అవసరం అంటూ అధికార దర్పణాన్ని ప్రదర్శిస్తున్నాడు. తానుంటున్న మండలం కాకుండా పక్కనున్న మండలాలలో ఈ దందాను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల కన్ను సన్నుల్లో ఉంటూ గత 15 సంవత్సరాలగా ఈ దందాలు కొనసాగించడం విశేషం. తాను ఆల్ రౌండర్ అన్నని, ఏ పార్టీ అధికారంలో ఉన్న తనకు తిరుగు లేదంటూ కమ్మటి మాటలు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అందు తగ్గట్టుగానే ఆ చోట నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ వారితో ఫోటోలు వీడియోలు తీయించుకొని పాపులారిటీ ఇతరుల చేత సోషల్ మీడియాను వేదికగా పోస్ట్ చేయించుకోవడం విశేషం. ఇటీవల ఓ ప్రజా ప్రతినిధి మీటింగ్ కోసం అంటూ నాయుడుపేట మండలంలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహణ దగ్గరికి వెళ్లి మీటింగ్ అవసరమైన స్టేజి, భోజనాలు, ఫ్లెక్సీలు పేరుతో లక్ష 30 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మీటింగ్ నిర్వహణకు మండలంలోని కొందరు నాయకులు సొంతంగా విధులు కూర్చుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ప్రైవేట్ సంస్థ నిర్వాహకుల వద్ద తీసుకున్న నగదును ఈ కార్యక్రమానికి వెచ్చించానని చెప్పుకోవడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు చోటా నాయకుడిని నిలదీయడంతో ఈ అవినీతి బాగోతం బట్టబయలు అయింది.ఈ చోట నాయకుడు అవినీతి బాగోతాలు నాయుడుపేట, ఓజిలి, చిల్లకూరు మండలాలలో తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇలాంటి చోట నాయకుడి వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.