చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి పేరు పరిశీలన?ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి జడ్పిటిసి కి చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రయత్నాలు తెరచాటుగా మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డికి చైర్మన్ పదవిని కట్టబెట్టే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న జడ్పిటిసి లో ఒకరు జడ్పి పీఠం కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాజా మాజీ మంత్రి,ప్రస్తుత పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో జిల్లా పరిషత్ చైర్మన్ సీటుపై నీలి నీడలో కమ్ముకుంటున్నాయి. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వున్న శ్రీకాళహస్తి జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. వైసిపి పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపి నేతలపై చేయించిన, చేసిన దాడులు, అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. దీంతో టిడిపి నాయకులు పెద్దిరెడ్డి ఆదిపత్యానికి అడ్డుకట్ట వేయాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. పైగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అంగళ్లు వద్ద దాడి చేయించి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తెలుగుదేశం లో చేరిన జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టిడిపి నాయకులు పావులు కదుపుతున్నట్టు సమాచారం. టిడిపి నేతలకు వాస్తవానికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పై ఎలాంటి వివక్ష లేకున్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై ఉన్న రాజకీయ విభేదాల వల్లే జడ్పీ చైర్మన్ పదవిని టిడిపి జెడ్పీ టి సి వెంకటసుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చుని పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. వాస్తవం తెలియాలంటే మరికొద్ది రోజులు వేసి చూడాల్సిందే.
మారిన రాజకీయ సమీకరణాలతో…చిత్తూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more