ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో, ఆర్థిక మంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ మంచి విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
Related Posts
ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ…ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!
ప్రభాతదర్శిని, (డెస్క్ ప్రతినిధి):భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం (అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు…
Read moreభారత దేశ పారిశ్రామిక చరిత్రలో ముగిసిన రతన్ నావల్ టాటా శకం
అనారోగ్యంతో ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో పారిశ్రామిక దిగ్గజం కన్నుమూతటాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త..ప్రభాతదర్శిని, (ముంబై-ప్రత్యేక ప్రతినిధి):భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక…
Read more