ప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మహిళలది కీలకపాత్ర వహించిన చరిత్ర ఉన్నదని రాబోయే రోజుల్లో కూడా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని ఎమ్మెస్పి. రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ కోరారు. కైతాబాద్ నియోజవర్గం హిమాయత్ నగర్ మల్లికార్జున నగర్ లో మాదిగ మాహిళ సమైక్య జిల్లా నాయకురాలు అంబిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సురారం సుజాత మాదిగ మహిళా సమైక్య జిల్లా అధికార ప్రతినిధి హాజరై మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి వెంకటస్వామి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మహిళలది కీలకపాత్ర వహించిన చరిత్ర ఉన్నదని రాబోయే రోజుల్లో కూడా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని కోరారు. సుజాత మాట్లాడుతూ మహిళలు కీలక పాత్ర పోషించాలని మొట్టమొదట అసెంబ్లీ చుట్టుముట్టిన చరిత్ర మహిళలకు ఉన్నదని గుర్తు చేశారు. సమావేశానంతరం మాయల నూతన కమిటీ ఎన్నిక చేశారు. ఈ సమావేశంలో అంబిక తో పాటు తార,‌ మాధవి, విజయలక్ష్మి, శాహిన్, ముస్కాన్, ‌ నాగలక్ష్మి, కళావతి, అనసూయ, సంతోష తదితరులు పాల్గొన్నారు.