ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసు కుంటుంది. ఈ కేసు నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూత పడేలా చేసాయంటున్నారు ..దీంతో రాష్ట్ర వ్యాప్తంగాను ఈ కేసు పై చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయంపై నగరమేయర్ భవితవ్యం ఆధారపడి ఉండటం ఆసక్తి రేపుతోంది. నెల్లూరు నగరపరిధిలో మార్టిగేజ్ రిలీజ్ వ్యవహారంలో పెద్ద తంతే నడిచింది. వారి జేబులు నింపుకు నేందుకు వైసీపీ ప్రజా ప్రతినిధులు అడ్డదారులు తొక్కారు. అధికారంలో ఉన్న పార్టీల నేతలు వైసీపీ నేతలు శృతిమించి వ్యవహారం నడిపించారు. నగర కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి దందాలకు పాల్పడ్డారు.. ఆ విషయం బయటపడటంతో వివాదం ముదిరింది విమర్శలు పెరిగాయి. ఏకంగా కమిష నర్ సంతకాన్నిఫోర్జరీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ న్యాయవాది కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్ విచారణ చేసి తనసంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం అనేక మందికి తెలిసినా స్వయం గా కమిషనర్ ఫిర్యాదు చేసే వరకు పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. నగర కమిషనర్ ఫిర్యాదుతో ఇప్పటికే ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు
మొదలు పెట్టారు. అందరూ ఫోన్ స్విచాఫ్ చేసి మరీ గాయబ్ అయిపో యారు.. ఆ ఎపిసోడ్ బయటపడ్డ తర్వాత మేయర్ స్రవంతి పరిస్థితి దయనీయంగా మారింది. కార్పొరేషన్లో ఆమె మాట చెల్లుబాటు అవ్వడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో ఆమె రాజీనామా చేస్తారా? లేకపోతే ఆ పోర్జరీ ఎపిసోడ్లో కీరోల్ పోషించినట్లు ప్రచారం జరుగుతున్న భర్త జయవర్ధన్ను కాపాడు కోవడానికి ఏం చేయబోతున్నారన్నది చర్చల్లో నలుగుతుంది. దీనికి సంబంధించి మేయర్పై చట్టపరమైన చర్యలు ఉండకపోయినా.. పరిపాలనపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మార్ట్ గేజ్ రిలీజ్ కోసం జరిపిన పైరవీల్లో అనేకమంది వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను నగర మేయర్ పొట్లూరి స్రవంతి, భర్త జయవర్ధన్ వెనకేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. మేయర్ స్రవంతి అప్పట్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అండతో పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులుగా వ్యవ హరిస్తూ వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించారు. వైసీపీకి దూరం అయ్యారు. కోటంరెడ్డి ఆశీస్సులతో మేయర్ అయిన స్రవంతి ఆమె భర్తలు ఆ టైంలో చచ్చేవరకు తమ వెంట కోటంరెడ్డి వెంటేనని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఎన్నికల టైంకి తిరిగి ప్లేట్ మార్చి వైసీపీకే ఫిక్స్ అయ్యారు. అప్పుడే వారు పోర్జరీల ఎపిసోడ్ని మరింత స్పీడ్గా నడిపించారంట.. అప్పుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరురూరల్లో కోటంరెడ్డి శ్రీధర్పై పోటీ చేసిన ప్పుడు మేయర్ కపుల్ వైసీపీ తరపున హడావుడి చేశారు. ప్రస్తుతం ఆమె కేసు మరింత జటిలం కావడానికి ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చే సమయానికి ఆమె వైసీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పంచన చేరదామన్నా సాధ్యపడలేదు. గత నెలలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. చేసిన తప్పును క్షమించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమను ఆదరిస్తారని భావిస్తున్నామని మేయర్ స్రవంతి దంపతులు బహిరంగంగా వేడుకున్నా.. ఆయనందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసులో ఏడుమందిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మేయర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అనుకుని వైసీపీలోనే కొనసాగటం వైసీపీ ఓటమి పాలయ్యాక తెలుగుదేశం పార్టీ పంచన చేరే ప్రయత్నం చేయడంతో రెండుపార్టీలకు ఆమెకు దూరమైనట్లు అయ్యింది. ఆ క్రమంలో ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చివరిగా రాష్ట్రమంత్రి నారాయణను కలిసి తనను ఈకేసు నుంచి బయట పడేలా చూడాలని విజ్ఞప్తి చేసేపనిలో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు కోటంరెడ్డిని కాదని నారాయణ వారికి సహకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ కేసు వ్యవహారం పక్కన పెడితే.. ఆమెను
మేయర్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు అధికార కూటమి ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో కోటంరెడ్డి అనుచరుడైన జయవర్ధన్ భార్య స్రవంతి మేయర్ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేత రూపుమార్ యాదవ్, ఖలీల్అహ్మద్ ఉన్నారు. నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మంత్రి నారాయణ చేతిలో పరాజయంపాలైన ఖలీల్ అహ్మదు మేయర్ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది రూపుమార్ యాదవ్.. అయితే ఎస్టీ రిజర్వుడు కావడంతో ఆ పదవి రూప్కుమార్కు దక్కేపరిస్థితి లేదు. దాంతో మేయర్ స్రవంతిలను సెలవుపై వెళ్లేలా చేసి ఇంచార్జ్ మేయర్గా రూప్ కుమార్యాదవు కొనసాగించే అవకాశం ఉంది. ఆ దిశగా మంత్రి నారాయణ పావులు కదుపుతున్నారంట.