ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్ చికిత్స: మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ
ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక ప్రతినిధి) అంకురా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి కంటిన్యూగా ఫిట్స్ తో స్పృహలో లేని స్థితిలో బాలుడికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం అంకుర ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ బాలుడు వివరాలను మీడియాకు తెలియజేశారు.
పద్మావతి పురంలోని శబరీష్(13) గత పది రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడుతూ ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ క్లినిక్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చెన్నై, బెంగళూరు పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు. రేణిగుంట రోడ్డులోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కు తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన సమయంలో బాబుకి విపరీతంగా ఫిట్స్ రావడం స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి చేరుకున్న బాలుడిని వెంటనే వైద్యులు పరీక్షించి చికిత్సను ప్రారంభించారు. డాక్టర్ రవిచంద్ర (పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్), మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ దినేష్ రెడ్డి,డాక్టర్ పార్ధ సారథి(పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్‌లు),డాక్టర్ రమణ మల్టీడిసిప్లినరీ టీమ్‌ ఆ బాలుడికి అరుదైన చికిత్స అందించారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న అతనికి శ్వాస, ఆక్సిజన్ థెరపీతో ఏడు రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించారు. దాదాపు వారం పాటు సమగ్ర సంరక్షణ తర్వాత బాలుడిని డిశ్చార్జి చేశామని తెలిపారు. అంకుర ఆసుపత్రిలో ఎంతో నైపుణ్యం కలిగిన ప్రముఖ పీడియాట్రిక్స్ వైద్యులు ఉండడం వల్లనే ఈ చికిత్స విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. అంకురా హాస్పిటల్ తన రోగులందరికీ అసాధారణమైన సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉండడం, అరుదైన, సంక్లిష్టమైన వైద్య పరిస్థితులకు చికిత్సలో ముందంజలో ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో బాలుడు పూర్తి స్పృహలో లేకపోవడం, వెంట వెంటనే ఫిట్స్ వస్తున్నాడంవలన పరిస్థితి విషమంగా మారిందని, పరీక్షలు చేయగా వైద్యులు మెదడు వాపు వ్యాధిగా నిర్ధారించడం జరిగిందన్నారు. వెంటనే తమ ఆసుపత్రిలోని మల్టీడిసిప్లినరీ బృందంతో కూడిన ఐసీయూ వైద్యులు, పీడియాట్రిక్స్ న్యూరాలజీ,పీడియాట్రిక్స్ వైద్యులు చికిత్స ప్రారంభించి వైద్య సేవలు అందించడంతో ఆరు రోజుల తర్వాత స్పృహలోకి రావడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, అన్ని రకాల వైద్య విభాగాలు ప్రముఖ వైద్యులు ఒకే చోట ఉండడం వలన బాలుని బ్రతికించగలిగామని ఆయన పేర్కొన్నారు. అంకురా ఆసుపత్రిలో వైద్య బృందంచే అందించే చికిత్స, పునరావాస ప్రోటోకాల్ల ప్రభావాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా బిడ్డ మాకు దక్కడు అనుకున్న సమయంలో అంకుర ఆసుపత్రి వైద్యులు అంకితభావంతో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. సమావేశంలో అంకుర ఆసుపత్రి వైద్యులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.