ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ప్రాణహాని పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read more“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read more