రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి బీజేపీ నేతల విజ్ఞప్తి
ప్రభాతదర్శిని,(కోట – ప్రతినిధి): గూడూరు డివిజన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కోట, వాకాడు మండలాల కు చెందిన బిజెపి నాయకులు కోరారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని సోమవారం విజయవాడలో మంత్రి చాంబర్లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వర రావు,తిరుపతి జిల్లా బిజెపి కోర్ కమిటీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి,తిరుపతి జిల్లా బిజెపి సీనియర్ నాయకులు పాదర్తి కోటారెడ్డి, కోట, మండలాలకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు మండలాల లోని పలు ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు, ఆస్పత్రుల పనితీరును పరిశీలించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసికెళ్లారు. స్పందించిన మంత్రి వచ్చే నెల 9వ తేదీ నెల్లూరు జిల్లా పర్యటన ఉందని అందులోభాగంగా గూడూరు డివిజన్ కి రానున్నట్లు ఆ క్రమంలో డివిజన్ లో ఆసుపత్రులను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు కోటేశ్వర రావు తెలిపారు. మండలంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, నిర్వహణ అధ్వానంగా ఉన్నాయని, దశాబ్దాల క్రితం వందలాది మందికి ఆరోగ్య సేవలు అందించిన బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాల దుస్థితి గురించి మంత్రి దృష్టికి గూడూరు నియోజక వర్గ ఇంచార్జి పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డీ తీసుకెళ్లారు.మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ గత ప్రభుత్వం కన్నా,మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్య కుమార్ హామీ ఇచ్చారన్నారు.