ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి):ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 1983 సంవత్సరంలో నీ తండ్రి కిలివేటి రాజయ్యకు ఎన్టీ రామారావు ప్రభుత్వం పది రూపాయలు పదివేల రూపాయలు చేస్తే పక్కా ఇంటిని మంజూరు చేసిందని ఆ ఇంట్లో నివాసం ఉండే రాజయ్య వారసుడు సంజీవయ్యకు 400 కోట్లు ఎలా వచ్చాయని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ ఇంట్లో ఉన్నప్పుడు నీ ఆస్తులు విలువ ఎంత? నేడు నాలుగు వందల కోట్లు సంపాదించా నీకు ఈ ఆస్తులు ఎలా వచ్చాయంటూ నెలవల సుబ్రహ్మణ్యం సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భట్లకనుపూరు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి పై సంజీవయ్య వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం అన్నారు. నీవు నీ ప్రభుత్వం పనిచేయని సేవలను తన సొంత నిధులతో మధుసూదన్ రెడ్డి విద్య వైద్యభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. గృహనిర్మాణ శాఖ లో డిఇగా ఉన్న నీకు 400-500 కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మీ మామ నీకు రెండు మూడు కోట్లు మాత్రమే ఇచ్చి ఉండవచ్చని మరి నేడు నీకు ఎన్ని కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలలో ఓడిపోతామని భయంతో పారిశ్రామికవేత్తల పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని సూచించారు. నీ నియోజకవర్గంలో ఓ జిల్లా మండలంలో మధుసూదన్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలపై అభినందించి కృతజ్ఞత తెలుపవలసిన ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. నీకు నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే విని ఊరుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీలోకి చేర్చుకోవాలని నువ్వు చేసిన ప్రయత్నాలు బెడిసికొకొట్టాయి అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నువ్వు చేసిన అరాచక పనులకు టిడిపి నాయకులు కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. డబ్బుతో కొనాలని అనుకున్నా అది నీకు సాధ్యం కాలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించడమే లక్ష్యంగా పనిచేసిన నువ్వు ఎందుకు ప్రచారంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఓటర్లు నిన్ను చీదరించుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారాల్లో ఓట్ల నాడి తెలుసుకొని ఓడిపోతామని భయంతో లేని పోనీ విషయాలు పై నోరు పారేసుకోవడం తగదన్నారు. అవినీతి సంపదకు అలవాటు పడ్డ నువ్వు ఇసుక గ్రావెల్ మాఫియాతో కుమ్ముక్కై ఐదేళ్ల కాలంలో 500 కోట్లు సంపాదించాలేదా? అని ప్రశ్నించారు.నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ము పై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపిస్తామని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో నెలవల విజయశ్రీ 25వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పరస వెంకటరత్నయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సేవ గుణం తో సమాజానికి సేవ చేస్తున్న గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండటం సంతోషదాయకమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మధుసూదన్ రెడ్డి చేస్తున్న సేవలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్లి ఆయనకి మరింత సహకారం అందిస్తామని తెలిపారు. నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సేవ దృక్పథంతో పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డిని విమర్శించే అర్హత కిలివేటి సంజీవయ్యకు లేదని అన్నారు. ఈ సమావేశంలో ఓజిలి మండల టిడిపి అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, మండల టిడిపి నాయకులు ఎద్దుల ధనంజయ రెడ్డి, కనుమూరు గోపాల్ రెడ్డి, బత్తల రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు నాయుడు, నన్నూరు శ్రీనివాసరావు, ఎద్దల శేఖర్ రెడ్డి, కంకణాల సత్య వరప్రసాద్ నాయుడు, చింతల సతీష్ చంద్ర, కొండూరు సుబ్బారెడ్డి, కొండూరు ఈశ్వర్ రాజు, సురేష్ రాజు, మస్తాన్ రెడ్డి, ఎల్లు సుధాకర్. వర్మ రెడ్డి, పి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య…నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి?…సమాజ సేవకులను వ్యక్తిగత విషయాలతో విమర్శిస్తావా?…సూళ్లూరుపేట ఎమ్మెల్యే పై నెలవల సుబ్రహ్మణ్యం ఆగ్రహం
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read moreఏసీబీకి చిక్కిన డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి
ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో…
Read more