ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):చేతి వృత్తులతోనే మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధ్యమని తెలిపారు. శనివారం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వస్తెనాక్టివ్ వారి సహకారంతో 60 మంది మహిళలకు కలంకారి వర్క్ మీద రెండు బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ వెలుగు) ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వెలుగు సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ సిర్డ్స్ సంస్థ ద్వారా ఎర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. అనంతరం వెలుగు సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ తిరుపతి రూరల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కలంకారి కళలకు మంచి డిమాండ్ ఉందని,దీనిని అనుసరించుకొని మంచి నైపుణ్యం సాధించి ఆర్ధికాభిరుద్ది చెందాలని తెలిపారు. అనంతరం ఎస్ఓఎస్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళా కూడా ఈ కలంకారీ వర్కని నైపుణ్యంగా నేర్చుకొని మార్కెటింగ్ పట్ల అవగాహన పెంచుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనిదే సిర్డ్స్ సంస్థ లక్ష్యమని దీనిని మీరూ సాదించాలని తెలిపారు. అనంతరం సిర్డ్స్ సంస్థ కార్యదర్శి హేమశేఖర్ మాట్లాడుతూ సిర్డ్స్ సంస్థ మహిళా వికాస్ అనే కార్యక్రమము ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగా నేడు కలంకారి వర్క్ మీద 60 మంది మహిళలకి శిక్షణా ఎర్పాటు చేయడం జరిగిందని, అందులో 30 మందికి ఒక్క బ్యాచ్,అలాగా 2 బ్యాచ్ లుగా మహిళలకు కాలంకారి మీద శిక్షణా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ అనంతరం అందరికీ ధ్రువపత్రాలు అందజేసి బ్యాంకు లింకేజీ కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రాస్ సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, సిర్డ్స్ సంస్థ కోఆర్డినేటర్ తేజోవతి , కలంకారి శిక్షకురాలు పద్మా మహిళలు పాల్గొన్నారు.
ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి:డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more