ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా ఇ. కిరణ్మయి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సూళ్లూరుపేట లో ఉన్నటువంటి రంగాల చంద్రముని బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వి కిరణ్మయి పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమెను సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ఆమె భర్త పార్థసారధి ఇరువురు ఆమెతో మాట్లాడి అభినందించారు. ఆమె గుంటూరులో పనిచేసి విజయవాడ లో పని చేసి బదిలీ పై సూళ్లూరుపేట కు రావడం జరిగినది ఆమె ను ఆర్డీవో కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికి ఆహ్వానించారు. కార్యక్రమం లో ఆర్డీవో కార్యాలయం డి ఏ ఒ కే రవికుమార్ ఆమె కు స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం బదిలీ అయి వెళ్ళిపోతున్న ఆర్డీవో ఆర్ చంద్రముని కి ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనను శాలువాలతో సన్మానించి అభినందించారు. బదిలీపై వెళ్లిన ఆర్డీవో చండ్రముని వారి సతీమణి కి ఘన వీడ్కోలు పలికారు ఆర్డీవో కార్యాలయం సిబ్బంది ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు అభినందించారు.
పేట నూతన ఆర్డీవో ఇ. కిరణ్మయి బాధ్యతలు స్వీకరణ
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more