అధికారుల సమీక్షలో ఓజిలి ఎంపీపీ

ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలంలో పంచాయతీలలో పారిశుద్ధ్యని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక చూపాలని  ఓజిలి ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయనే తన చాంబర్లో మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. రానున్నది వర్షాకాలం అని పారిశుధ్యం లోపించే అవకాశం ఉందని తద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలో పర్యటించి పారిశుద్ధ్యని  మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటలు, మురికి నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు పూర్తి వేసి బ్లీచింగ్  చల్లాలని అన్నారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అనారోగ్యం పాలు కాకుండా చూడవలసిన బాధ్యత  అందరిపై ఉందని ఆమె అన్నారు. ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి  పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ప్రతి శుక్రవారం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం ఇతర సిబ్బంది పర్యటించి మురికికుంటలో కాలువలను తొలగించి పారిశుధ్యం మెరుగు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఈవో అండ్ పి ఆర్ డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.