సంస్కృతికి ప్రతిరూపం
జీవనసౌందర్యం
అసమానతలు తొలగించి
మానవజాతి పరిణామంలో
కొత్తచివురు తొడిగించేది
తెలుగుభాష ఒక్కటే.
అమ్మనేర్పిన భాష
అమ్మకుఇష్టమైన భాష
మన అమ్మభాష తెలుగు
జనమంతా తెలుగు
జగమంతా వెలుగు.
ఇసుకలో మట్టిపలకలమీద
ప్రకాశిస్తున్న తెలుగుభాష
యుగయుగాల్లో రాజస్థానాల్లో
వెలిగిన జీవద్భాష
పలుకులసొగసు తెలుగుకేతెలుసు.
పదాలపెదవులమీద మెదలుతుంటే
కలంతో వాటిని సమంచేసి
అక్షరాలుగా కూర్చి
కవిత్వమనే సంపదను సృష్టిద్దాం
తెలుగుభాష గొప్పదనాన్ని
గణనీయంగా వెలిగిద్దాం
తెలుగును ఎప్పటికీ
సజీవంగా నిలుపుదాం…
తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులు
తణుకు.9441831544
పలుకులసొగసు తెలుగుకేతెలుసు…!
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more