
మహాజన టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు మస్తాన్
తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ 134 జయంతి వేడుకలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు మస్తాన్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పర్రి వీర రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జడ చలపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేవూరు మస్తాన్ మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా యువత అడుగులు ముందుకేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్షతలతో అంటరానితనంతో నిండి ఉన్న భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వ్యవస్థ పోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలగన్న కలలను సాకారం చేసుకునేందుకు యువత సామాజిక స్పృహతో పోరాడాలని సూచించారు. సామాజిక రుగ్మతలపై తిరుగుబాటు చేశారని అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడమే అంబేద్కర్ కు నిజమైనా వారసులు అని అన్నారు. మహాజన టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జడ చలపతి మాట్లాడుతూ సమానత్వం, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి చెందాలంటే అది రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్యం దృఢమైన, అతిపెద్ద రాజ్యాంగంను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతికి అంకితం చేశారని కొనియాడారు. దేశానికి అపురూపమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖపాత్ర నిర్వహించారని, భారతీయ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ జన్మదినం అయిన ఏప్రిల్ 14 అంబేద్కర్ జరుపుకోవాలని భారతదేశ ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన పీడిత ప్రజలకు ఒక వరమనే ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మహాజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.