ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
ఛార్జర్లపై రాసిన ఈ పదాలకు అర్థం తెలుసుకుందాం
మార్కెట్లో అనేక రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఛార్జర్లను GaN, PD అని లేబుల్ చేస్తారు. హైపర్ఛార్జ్ లేదా వూక్ వంటి పదాలను ఉపయోగిస్తారు. ప్రతి పదానికి అర్థం ఏమిటో తెలియక చాలా మంది తరచుగా గందరగోళం చెందుతారు. అయితే అవన్నీ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినవి. వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు వారి స్వంత ఛార్జింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్,…
Read moreఏ.సి.బి అధికారులకు చిక్కిన అవినీతి గ్రామ రెవిన్యూ అధికారి
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more