ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి సమావేశ ఎన్నికల ప్రచార కార్యక్రమం కు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి.రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూమ్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని కోరారు.
నారా లోకేష్ తో విపిఆర్, రూప్ కుమార్ లు భేటీ
Related Posts
ఏసీబీకి చిక్కిన డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి
ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో…
Read more“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read more