

ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలో గత తొమ్మిదేళ్లుగా ఆగిపోయిన శ్రీ హజరత్ అమీర్ షావలి 74 గంధ మహోత్సవం (ఉరుసు) గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులు పాటు నిర్వహించనున్న గంధ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. గురువారం రాత్రి గంధ మహోత్సవం, శుక్రవారం రాత్రి సినిమా పాట కచ్చేరి, శనివారం మధ్యాహ్నం అన్నదానం, రాత్రి జబర్దస్త్ టీం ఆర్కెస్ట్రా సాంస్కృతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గంధ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు ఆరుగురు సిఐలు, 15 మంది ఎస్సైలు, 300 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ హజరత్ అమీర్ షావలి దర్గాను విద్యుత్ దీపాలతో వైభవంగా తీర్చిదిద్దారు. శ్రీ హజరత్ అమీర్ షావలి గంధ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంభేటీ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టిడిపి నేత నెలవల రాజేష్ లు రెండు వర్గాల తో చర్చించి గంధ మహోత్సవ కమిటీని ఏర్పాటు చేశారు.
