ప్రభాత దర్శిని( నెల్లూరు బ్యూరో) నక్కలకాలనీ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలోని నక్కలకాలనీలో పర్యటన సందర్భంగా సోమిరెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా తీసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1983లో నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయాంలో నక్కలకాలనీలో ఒక్కో కుటుంబానికి 33 అంకణాల స్థలం ఇచ్చారనారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇప్పుడు ఇళ్లు లేని వారికి స్థలాలు మంజూరు చేయడంతో పాటు పక్కా గృహాలు కట్టిస్తా మన్నారు. అర్థంతరంగా ఆగిపోయిన పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేయిస్తా మని తెలిపారు. నక్కలకాలనీలోనే కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తయారీలో అనుభవం కలిగిన స్థానికులకు ఐటీడీఏ సహకారంతో రుణాలు మంజూరు చేయిస్తా మన్నారు. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండేలా చూడటంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.ప్రతి గ్రామ పర్యటన సందర్భంగా గిరిజన కాలనీలను అధికారులతో కలిసి సందర్శించి వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యావంతులు కూడా గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.