
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దళితులకు అండగా నిలవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి కోరారు. మంగళవారం తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమాకుల పుణ్యమూర్తి మాట్లాడుతూ తిరుచానూరులో ఒక స్థల వివాదంపై దళితుల మీద దాడి జరగడం బాధాకరమన్నారు. తిరుచానూరు గ్రామ కమిటీ టిడిపి అధ్యక్షులు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. దాన్ని ప్రశ్నించినందుకు సంఘం నాయకులు విజయ్,మధు లపై విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగిందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అయితే కౌంటర్ కేసు కూడా దాఖలు చేయడం బాధాకరమని తెలిపారు. ఎస్సీలపై దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని మామూలు BNS సెక్షన్లతో కేసులు కట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనిపై అడిషనల్ ఎస్పీ ని కలిసి అన్ని విషయాలు వివరించడం జరిగిందన్నారు.దాడికి సంబంధించి కూలంకుషంగా పరిశీలన చేసి నివేదికను తెప్పించుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తానని అడిషనల్ ఎస్పి రవి మనోహర చారి. హామీ ఇవ్వడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని అనేక సందర్భాల్లో దళితుల పక్షాన నిలబడి న్యాయం చేసిన వ్యక్తి గా పేరు ఉంది , అలాంటి ఆయన నియోజకవర్గంలో అది కూడా ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ప్రోత్సాహంతో దళితులపై దాడి జరగడం అత్యంత బాధాకరమన్నారు. దీనిపై ఎమ్మెల్యే విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, అదికూడా విచారణ దశలో ఉందని తెలియజేశారు. అదేవిధంగా టిడిపి జిల్లా అగ్రనాయకత్వానికి మరియు నాయకుల కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నాయకులు దళితులను ఇబ్బంది పెట్టడం దాడులు చేయడం మానుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం ఆ విధంగా చేయడం వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో గమనించాలన్నారు. ఇటువంటివి పురాణావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై ఉందన్నారు. అక్కడ స్థల వివాదంసంబంధించి తాసిల్దార్ ఉత్తర్వుల బి ఎన్ ఎస్164 ప్రకారం దాన్ని నిషేధ ప్రాంతంగా ప్రకటించాలని కోరడమైనది.అనంతరం దానిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.