ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అనంతరం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులను వేద పండితులు అందించారు. తిరుమలలో సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్ వద్దకు తెదేపా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.