
నోటీసులు ఇవ్వకుండా కొట్టు తొలగింపుపై విచారణ చేపట్టాలి
గూడూరు సబ్ కలెక్టర్ ను కోరిన బాధితులు
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి): గూడూరు పట్టణంలో కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న కొట్టును ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు కూల్చి వేశారని తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితులు కోరారు. శనివారం బాధితులు శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు, మూడు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 576సీ, 576 ఏ లో ఓ ప్రైవేటు స్థలం తాము కొనుగోలు చేశామని ఈ స్థలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని,గత మూడు సంవత్సరాలుగా మున్సిపాలిటీ కి పన్ను చెల్లిస్తున్నామని,విద్యుత్ మీటర్లు ఉన్నాయని అయినా ఆక్రమణ ల పేరుతో గూడూరు తహసీల్దార్ కార్యాలయం వారు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా జేసిబి లతో ప్రహరీ లోపల ఉన్న తమ కొట్లు పగలగొట్టారని దీనిపై కోర్టుకు వెళ్ళమని,రోడ్డు పై ఉన్న ఆక్రమణలు తొలగించకుండా ఉద్దేశ పూర్వకంగానే ప్రహరీ లోపల ఉన్న తమ కొట్లు కూల్చివేశారని బాదితులు తెలియచేశారు. అలాగే మరో బాధితుడు వెంకయ్య మాట్లాడుతూ అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి అనంతరం 24 గంటల తర్వాత డేట్ లు మార్చి, సంతకాలు ఫోర్జరీ చేసి గంటా స్నేహలతకు మార్చి 18న నోటీసులు ఇచ్చినట్టు గోడకు అంటించారని తెలిపారు. బాధిత కుటుంబంలోని మహిళ లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త సుబ్బానాయుడును కొన్ని రోజులుగా పోలీసులు వేధిస్తున్నారని ఇంటిలోకి చొరబడి కొట్టి తన భర్తను చంపేస్తామని బెదిరించారని పిల్లలు అనాథలు గా అయిపోతారని బెదిరింపులు కు దిగుతున్నారని తమకు ప్రాణ హాని ఉందని తమకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరారు. గంటా స్నేహలతా /భర్త రాజా పేరుతో గూడూరు తహసీల్దార్ కార్యాలయం వారు మార్చి 18 న నోటీసులు ఇచ్చినట్టు సర్వే నెంబర్ 575 లో ఆక్రమణలు తొలగింపు కు గడువు లోగా స్పందించాలని పేర్కొన్నారు. కానీ ఈ సర్వే నెంబర్ లోని ఆస్తిని గతంలో బాధితులు కొనుగోలు చేసి మున్సిపాలిటీకి పన్నులు కడుతూ,విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ ఉండగా నోటీసులు ఎవరి పేరుమీదో ఇవ్వడం,చుట్టూ రోడ్డు పై ఆక్రమణలు వున్నా వాటిని పట్టించుకోకుండా ప్రహరీ లోపల ఉన్న కొట్లు కూల్చి వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని రాజకీయాల్లో అధికారులు పావులుగా మారి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని బాదితులు వాపోతున్నారు. గూడూరు తహసీల్దార్ అధికారులు కనీస నోటీసులు లేకుండా బెదిరింపు దోరణితో అధికార బలంతో కూల్చివేతలు చేపట్టడం పై తమకు జరిగిన అన్యాయం పై విచారణ చేపట్టి న్యాయం చేయాలని గూడూరు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు బాదితులు వెళ్ళగా సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడం తో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించిన బాధితులు,సబ్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడగా విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు బాదితులు తెలిపారు. గూడూరు పట్టణం లో ప్రధాన రోడ్లు ముత్యాల పేట,హాస్పిటల్ రోడ్డు,రాజా వీధి,కుమ్మరవీధి లాంటి చోట్ల ఆక్రమణలు రోడ్లపై వున్న పట్టించుకోకుండా అధికార బలంతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం మంచిదికాదని మొత్తం ఆక్రమణలు తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.