ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని ట్రినిటీ హాస్పిటల్ లో రాష్ట్ర విద్యాశాఖ,మానవ వనరుల అభివృద్ధి,ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మెడి ప్లస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదవరం సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ సేవలను కొనియాడారు. ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్, నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదవరం నాగురయ్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ బాబు తనదైన ముద్రతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు సామాన్య ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని, రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు లోకేష్ ఒక ఆశాకిరణమని, ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆదవరం అనుదీప్,బాలు, నాయుడుపేట రోటరీ క్లబ్ సభ్యులు బట్ట సుబ్రహ్మణ్యం, ట్రినిటీ హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.