ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్ జొన్నవాడ ప్రసాద్ వైసిపి టాటా చెప్పేపి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి సమక్షంలో సూరా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి ఆయన టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రశాంతి రెడ్డిని, కోవూరు ఎంఎల్ఏ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపించుకున్నేందుకు తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆయనతోపాటు బండెడ్డుల వేణు, దాసరి సుబ్బయ్య, కిష్టయ్య, జొన్నవాడ శేఖర్ చేరారు. అలాగే టిడిపి లో చేరిన అరుంధతివాడ యువతకు ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టిడిపిలో చేరిన ఏఎంసీ చైర్మన్ జొన్నవాడ ప్రసాద్…. ప్రశాంతిరెడ్డికి జై కొట్టిన బుచ్చి మండల ప్రజానీకం
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more