ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమ్మ ఆశీస్సులు సీఎం పై మెండుగా ఉండాలని అన్నారు. కోవూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంచలయ్య, ఆలయ కమిటి సభ్యులతో పాటు జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.