పత్రికలలో వచ్చిన ప్రతి సంఘటన ను అప్పటికప్పుడు సుమోటో గా పరిశీలించాలి చార్జి షీట్ పెట్టని పోలీస్ స్టేషన్ లకు త్వరలో నోటీస్ లు ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లా లో జరుగుతున్నటువంటి అన్నీ డిపార్ట్మెంట్ ల విషయాలు హై కోర్టు కు తెలపాలని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా హై లెవల్ మీటింగ్ జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికల లో వచ్చిన ప్రతి సంఘటన ను అప్పటి కప్పుడు సుమోటో గా పరిశీలించడం జరుగుతుందని ప్రధాన జడ్జి తెలిపారు. జిల్లాలో జరిగే అన్నీ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించుకోవలసిన అవసరం అధికారులకు ఉంది అని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో జరిగే లోక్ అదాలత్ ఈ సంవత్సరం చివరిది.జిల్లాలో లోక్ అదాలత్ 11 వ స్థానం లో ఉంది.5060 కేసు లు మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా న్యాయ అధికారులు 54 మంది ఉండాలి, ప్రస్తుతం 24 మంది ఉన్నారు. జిల్లాలో 700 మంది అధికారులు ఉండవలసి ఉంటే 370 మంది అధికారులే ఉన్నారు. ఈ నెల 27 వ తేదీ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర అధికారుల తో సమావేశం ఉంది అని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ తెలిపారు. లాంగ్ పెండింగ్ నాన్ బెయిల్ కేసు లు 144 ఉన్నాయి. అది కూడా 20 సంవత్సరాలుగా ఉండడం గమనార్హం. అని తెలిపారు. నాన్ బెయిల్ బుల్ వారెంట్ కేసు లు తిరుపతి, నెల్లూరులలో 3000 కేసు లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ లోక్ అదాలత్ లో వీలు అయినన్ని కేసులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఎక్సైజ్ కేసు లు కూడా ఎక్కువగా పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడుపుతుంటే ఫైన్ వేయడమే కాకుండా శిక్ష పడే విధంగా చూడాలి అని తెలిపారు. శిక్ష పడకపోతే తిరిగి తప్పు చేస్తారని జిల్లా జడ్జి తెలిపారు. విద్యుత్ శాఖ కేసు లు ఎక్కువగా ఉన్నాయి. వాటికి వెంటనే CC నంబర్ లు తీసుకోవాలని తెలిపారు. ఆకస్మికంగా జరిగే ప్రమాదాలలో కొన్ని వాహనాలు దొరక కుండా తిరుగుతున్నాయి.అయితే ఏ వాహనం గుడ్డింది అనేది తెలియకపోతే జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాంబే కి కలెక్టర్ తెలిపితే 5 లక్షలు నగదు బాధితులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 104 కేసు లు జరిగితే 17 కేసు లే పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు.తిరుపతి జిల్లా లో 59 నమోదు అయితే 19 మాత్రమే చేసినట్లు గుర్తు చేశారు. చార్జిషీట్ లు సకాలం లో నమోదు చేస్తే పరిష్కారం త్వరగా జరుగుతుందని చెప్పారు. 4 సంవత్సరాలు అయినా చార్జి షీట్ పెట్టని పోలీస్ స్టేషన్ లకు త్వరలో నోటీస్ లు ఇస్తున్నట్లు తెలిపారు. అండర్ ట్రయిల్ కేసులలో జామీను పెట్టుకోలేక కొంత మంది ఉన్నారు.వారికి లీగల్ సహాయం ప్రభుత్వం ఇస్తుంది 51 కేసు లు పెండింగ్ లో ఉన్నాయి. అని తెలిపారు. జిల్లా జైలులో 1000 మందికి నీటి వసతి లేదు. మునిసిపల్ నీరు కావాలని జైలు అధికారులు కోరారు.అయితే 30 లక్షలు ఖర్చు తో జిల్లా కలెక్టర్ బోరు వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరం లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.ఆటోలు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి అని ప్రీ లిటిగేషన్ కేసు లు నమోదు అయి ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ ను వారం వారం కచ్చితంగా పరిశీలించాలి. వాహనం నకు సంబంధించిన అన్నీ విషయాలు పరిశీలించాలని కోరారు. నెల్లూరు పట్టణంలో 1000 ఆటోలకు జరిమానా విధించినా జరిమానా కట్టకుండా తిరుగుతున్నారు వెంటనే జరిమానా విధించాలని జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చారు.ట్రాఫిక్ డీ.ఎస్. పి కి ఆదేశాలు ఇచ్చారు. ఆవులు అన్నీ రోడ్ మీద ఉంటున్నాయి. చర్యలు తీసుకోవాలని కోరారు.ఆవులను జైన్ గోశాల కు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని పరిశీలించాలని తెలిపారు. ఇటీవల 41 ఆవులు మాసం దుకాణాలకు తరలిస్తుంటే పోలీసులు పట్టుకోవడం జరిగింది.వాటిని గోశాల కు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు వారు వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవాలని కోరారు అందువలన మునిసిపల్ కమీషనర్ వారు వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.పట్టుకున్న కుక్క లను షెల్టర్ లో పెట్టడం జరిగిందని మొత్తం 250 కుక్కలను రక్షిత ప్రదేశం లో పెట్టినట్లు 600 కుక్కల ను పెట్టడానికి అవకాశం ఉందన్నారు. మాగుంట లే అవుట్ లో కుక్కలు ఎక్కువగా ఉన్నట్లు, మురికి కాలువలు పూడిపోయినట్లు గుర్తించినట్లు జిల్లా జడ్జి తెలిపారు.నగరపాలక కమీషనర్ మాట్లాడుతూ కాలువలు పూడి పోయాయని సర్వే చేసి తొలగిస్తామని తెలిపారు.33 అడుగుల కాలువలు 3 అడుగులు ఉన్నట్లు ప్రజలు తెలుపగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.5 సంవత్సరాల లో 1000 గృహాలు అనధికారికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మార్చి తరువాత అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అక్రమ కట్టడాలు కేసు లు 85 ఉన్నాయి వాటి పై కేసు లు నమోదు అయి ఉన్నట్లు త్వరలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీ లలో పన్నులు కట్టడం లేదని నెల్లూరు పట్టణం లో 100 కోట్లు బకాయిలు ఉన్నట్లు నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ తెలిపారు. వాటి కోసం 1200 పంచాయితీల లో కేసు లను లోక్ అదాలత్ లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ లు డిసెంబర్ 13 న లోన్ల బకాయిలు పరిష్కరించుకోవాలని , ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా సెటిల్ చేసే కేసు లను డిసెంబర్ 13 న పరిష్కరించుకోవాలని తెలిపారు.వన్ టైమ్ సెటిల్ మెంట్ ను ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో 400 మంది ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.జిల్లా ప్రధాన కోర్టు లో ఉన్న 20 కోర్టు లలో ఈ కేసు లు విచారిస్తున్నట్లు తెలిపారు.జైలు సూపరిండింట్ ద్వారా జైలు లో ఉన్న వారితో వారి కావలసిన వసతులు ఉన్నాయా లేవా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని తెలిపారు.జైలు నుండే ముద్దాయిలను ఆన్లైన్లో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లు కూడా కేసు ల మీద దృష్టి పెట్టాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కోర్టు నందు కోర్టు కు ఉన్న వసతులతో నిర్వహించాలని తెలిపారు.న్యాయ వాదులకు సరైన గౌరవం ఇవ్వాలని సూచించారు. జిల్లా లో న్యాయాధికారులను హైకోర్టు వారు త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. నేషనల్ రహదారులు సంబంధించి చిల్డ్రన్స్ పార్క్ వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి.చింతారెడ్డి పాలెం జంక్షన్ వద్ద 2010 నుండి 2025 వరకు 67 మంది చనిపోయినట్లు తెలిపారు.అయితే 2023 లో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.అక్కడ ఉన్న అనవసర దారులను మూసివేయాలని ఆదేశించారు. పట్టణం లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అధికారులు మాట్లాడుతూ అక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టడానికి అనుమతులు వచ్చాయి త్వరలో టెండర్లు పిలుస్తున్నట్లు చౌదరి,రవీంద్ర రెడ్డి తెలిపారు. 115.27 కోట్లు తో నిర్మిస్తున్నట్లు 18 నెల ల్లో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ దారులను వెంటనే మూసివేయాలి అలా చేయడానికి ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవు అని తెలిపారు. పట్టణంలో 7 పాయింట్ల లో సిగ్నల్ లైట్స్ ను ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు పట్టణం కమీషనర్ తెలిపారు. ఆటో లకు హెవీ లైట్స్ పెడుతున్నారని, సౌండ్ ఎక్కువ చేస్తున్నారని తెలిపారు. పట్టణం లో నిర్దిష్ట పాయింట్ల లో ట్రాఫిక్ పోలీస్ లు ఉండడం లేదని జిల్లా జడ్జికి తెలుపగా వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. కమ్యూనిటీ సర్వీస్ ను త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా న్యాయ సేవ కార్యాలయానికి లెటర్ ద్వారా తెలిపితే వెంటనే ప్రీ లిటిగేషన్ కేసు నమోదు చేసి పరిష్కరిస్తామని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ డ్జి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. వాణి, తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, నెల్లూరు, తిరుపతి ఎస్పీలు డాక్టర్‌ అజిత వేజండ్ల, సుబ్బరాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్‌ ఎస్పీ సౌజన్య, వివిధశాఖల అధికారులు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధశాఖల అధికారులు, న్యాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.