ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): రోడ్ల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ పనులను “జటాయుు” యంత్రం సహాయంతో అతి తక్కువ సమయంలో అత్యంత సులభతరంగా పూర్తి చేయవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. స్థానిక వి ఆర్ పీజీ కాలేజ్ వై.ఎం.సి.ఏ మైదానం సమీపంలో జటాయు యంత్రం పనితీరును కమిషనర్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జటాయు యంత్రం చిన్న చిన్న వ్యర్ధాలతోపాటు కొబ్బరి బోండాలను సైతం వాక్యూమ్ ప్రెషర్ పద్ధతిలో పీల్చిచేసి రోడ్లను శుభ్రపరు వస్తుందని తెలిపారు. వాహనాల కొనుగోలు ప్రక్రియలో భాగంగా ముందుగా నెల రోజులపాటు నగర వ్యాప్తంగా జటాయు యంత్రం సహాయంతో పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టనున్నామని, మెరుగైన ఫలితాలు కనబరిస్తే నూతన యంత్రాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.