అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్…

చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం

ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):
పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని వెంచర్లకు తరలిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి గ్రావెల్ మాఫియా తో ఇరిగేషన్ ఏఈ చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నేనే మంత్రి నేనే రాజు అనే విధంగా వ్యవహరించడం ఇతని ప్రత్యేకత. చెరువుల నుండి మట్టి గ్రావెల్ తరలించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్న వాటిని పక్కనపెట్టి తన అవినీతి సంపాదనను మూడు పూలు ఆరు కాయలుగా అవినీతి సంపాదనకు పాల్పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రింబగళ్లు తేడా లేకుండా చెరువుల నుండి భారీ హిటాచిలు టిప్పర్ల ద్వారా గ్రావెల్, మట్టి నాయుడుపేట, మేనకూరు, తుమ్మూరు, తాళాయిపాడు, సమీప ప్రాంతాల వెంచర్లకు అక్రమంగా తరలించి జేబులు నింపుకోవడం ఈయన ప్రత్యేకత. గతంలో కలవకూరు, పాలచూరు సప్లై ఛానల్ కు ప్రభుత్వం 36 లక్షల నిధులు మంజూరు చేయగా, అభివృద్ధి పనులు నాస్రికంగా చేపట్టి కాంట్రాక్టర్లు దగ్గర భారీ ముడుపులు తీసుకున్నట్లు పలు అవినీతి అభియోగాలు ఉన్నాయి. అలాగే జాతీయ రహదారి విస్తీర్ణ పనులు భాగంగా చెరువులలో మట్టి తరలించేందుకు ప్రభుత్వం ద్వారా తీసుకున్న అనుమతి గోరంతయితే? తరలించేది కొండంత అని ఇందులో భారీగా అవినీతికి పాల్పడ్డాడని మండలంలో ఆ నోట ఈ నోట పెద్ద ప్రచారమే జరుగుతుంది. పెళ్ళకూరు మండలంలోని బంగారంపేట, రోసనూరు, అర్థమాల, నందిమాల మోదుగులపాలెం, ఊడిపూడి,ఎర్రగుంట ఇరిగేషన్ చెరువుల నుండి ఇరిగేషన్ ఏ ఈ మాఫియాతో కలిసి చెరువులోని మట్టి, గ్రావెలను అక్రమంగా తరలించి లక్షల రూపాయలను కొల్లగొట్టారని విమర్శలు ఉన్నాయి. ఏఈ గత ఐదు సంవత్సరాల నుండి మండలంలో విధులు నిర్వహించడంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో చేతులు కలిపి ఎన్నో అక్రమార్కులకు పాల్పడ్డారని మండలంలో పెద్ద ప్రసారమే జరుగుతుంది. మండలంలో చిల్లకూరు, పాల్చూరు పలు చెరువుల పనులు జరుగుతుంటే ఆయా పనులను పర్యవేక్షించవలసిన ఏఈ పర్సంటేజ్ లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు దీంతో ఆయా పనులలు నాస్త్రింగా జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ సమావేశంలో తలుక్కుమని కనిపించే ఏఈ ఆ తరువాత మండలంలో ఎక్కడ కూడా కనపడడని, రైతులకు అధికారులకు అందుబాటులో ఉండడని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అవతలకు పాల్పడుతు చెరువులో గ్రావెల్ మట్టిని తరలిస్తూ చెరువుల రూపులేఖలను నాశనం చేస్తున్న ఏ ఈ పై చర్యలు తీసుకొని, చెరువులలో మట్టిని తరలింపుపై విచారణ జరిపి ఏ ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఏఈ అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.