ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి మురుగునీళ్లతో నిండిపోతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలలో దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే రాకపోకలకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంటలు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాగే బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు రాకపోకలు వేగంగా ఉండడంతో రోడ్లలో గుంటలు ఎక్కడున్నాయో తెలియక నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో గుంటల్లో టైర్లు పడి మురికినీరు పాదచారులపై పడుతున్నాయి. పట్టణంలో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిన కారణంగా హోలీ క్రాస్ సర్కిల్, గవండ్ల వీధి, పోస్టాఫీస్ రోడ్డు తదితర అనేక ప్రాంతాల్లో గుంటలు పడ్డ రోడ్లు మురుగునీటితో మునిగిపోతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు ఆటో వాలాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ సుందరీకరణపేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సూళ్లూరుపేట మున్సిపాలిటీ ప్రస్తుతం రోడ్లు మొత్తం గుంటల మయంగా మారిపోవడంతో అందులో కొద్దిపాటి వర్షానికి వచ్చిన నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోధకులు అనేక అవస్థలకు గురికావాల్సి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైన సూళ్లూరుపేట మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.