ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకుంటూ గోల్డ్ మెడల్ తో పట్టానందుకోనున్న విద్యార్థిని పలువురుకు ఆదర్శవంతంగా నిలిచారు. తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి గ్రామానికి చెందిన
మంగళపూరి ప్రిస్కీల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ సాధించడం ద్వారా ఓజిలి మండలం కీర్తి ప్రతిష్టలు విద్యారంగంలో కలిగితురాయిగా నిలిపారు. ఓజిలి గ్రామానికి చెందిన మంగళపూరి మనోహర్ రవికుమారి దంపతుల రెండవ కుమార్తె అయిన ప్రిస్కీల్లా ఎల్కేజీ నుండి చదువులో చురుకైన విద్యార్థిని గా ఉపాధ్యాయుల చేత ప్రశంసలు పొందారు.ఆమె తల్లి రవికుమారి ప్రభుత్వం ఉపాధ్యాయురాలుగా, తండ్రి మనోహర్ ఫాస్టర్ గా పనిచేసేవారు. ప్రిస్కీల్లా తన విద్యాభ్యాసాన్ని ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ఉన్న హరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఎల్కేజీ నుండి ప్రారంభమై సెకండ్ క్లాస్ వరకు కొనసాగింది. తరువాత 3వ తరగతి నుంచి 6 వరకు నాయుడుపేట లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనూ, 7వ తరగతి నుంచి 10 వరకు గూడూరు లోని ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొనసాగింది. చదువుల తల్లిగా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రిస్కిల్లా 2013లో 9.2 జిపిఏతో పదో తరగతిలో ఉత్తీర్ణత అయింది. 2015 సంవత్సరంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లో బైపిసి గ్రూపు నుండి 91% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించారు. 2019 సంవత్సరంలో గూడూరు డి ఆర్ డబ్ల్యు మహిళ కళాశాలలో బిఎస్సి (బిబిసి) 9.06 జిపిఏతో ఉత్తీర్త సాధించారు. 2021 సంవత్సరంలో ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) 9.83 జిపిఏ విక్రమ సింహపురి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టుగా రికార్డ్ పొందారు. ప్రిస్కిల్లా తండ్రి మనోహర్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తండ్రి మరణంతో కుంగిపోకుండా తన సోదరుడైన ఫ్రాంక్లిన్ ఆమెలోని ప్రతిభాను చూసి, మరింతగా ప్రోత్సహించాడు. గత నెలలో తన అన్న ఫ్రాంక్లిన్, ప్రిస్కిల్లా కు కనీవినీ ఎరుగని రీతిలో వివాహం జరిపించారు. వివాహ సంబరంలో మునిగితేలుతున్న ఫ్రాంక్లిన్ కుటుంబం తన సోదరికి బయో టెక్నాలజీలో గోల్డ్ మెడల్ రావడం మరింత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఈ నెల 22న జరుగు 8వ కాన్వొకేషన్ లో గవర్నర్ చేతుల మీదుగా ఆమె గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. ప్రిస్కిల్లా కు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ రావడంపై, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.