*ఎమ్మెల్యే* పులివర్తి నాని
ప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారీ మెజారిటీతో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి
దర్శనానంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పులివర్తి నాని కుటుంబాన్ని ఆశీర్వదించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
చంద్రబాబు కు కానుకగా చంద్రగిరి టిడిపి గెలుపు
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more