ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా హైపర్ ఛానల్ రిపోర్టర్ (సచిన్) వి నాగేంద్ర, (టీవీ-5 )ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కాలనీలో హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా వి నాగేంద్ర,ప్రధాన కార్యదర్శిగా బొలిగర్ల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా (ఐ న్యూస్ )గూడూరు డివిజన్ రిపోర్టర్ కే సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా గూడూరు డివిజన్ మహా న్యూస్ రిపోర్టర్ అల్తాఫ్, ప్రజాబంధం దినపత్రిక ఎడిటర్ మీజూరు మల్లికార్జున్ , న్యాయ సలహాదారుగా గూడూర్ డివిజన్ (ఏబీఎన్) ఛానల్ రిపోర్టర్ పి రమేష్, కార్యవర్గ సభ్యులుగా గూడూరు డివిజన్ ( 10 టీవీ) రిపోర్టర్ మందా ప్రభుదాస్, గూడూరు డివిజన్(6టీవీ) రిపోర్టర్ రఘు, ఉదయం దినపత్రిక గూడూరు డివిజన్ రిపోర్టర్ బాబు మోహన్ దాస్, ఇప్పుడు దినపత్రిక రిపోర్టర్ ఉడుతా శశిధర్ లను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యవర్గ ఎన్నిక సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా సచిన్, వెంకటేశ్వర్లు
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more