ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా? లేక మరేమైనా ఇతర కారణలా?
మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలు

ప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆదిశంకర కాలేజ్ లో గురువారం ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనే యువకుడు కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.మృతుడు బిల్డింగ్ పై నుండి దూకేసాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిశంకర కాలేజ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. గతంలో అనేకమంది విద్యార్థులు కాలేజీలోనే మృతి చెందిన ఘటనలు మరవక ముందే గురువారం జస్వంత్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యార్దులు గ్రూపులు గ్యాంగ్ వార్లకు నిలయంగా మారుస్తూ, మత్తు పదార్థాలు కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలేజీ ముందరే కొన్ని గ్రూపులు కత్తులు చేతబట్టి గొడవలకు దిగడంతో అనేక మంది విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు, ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు కి చెందిన జస్వంత్ మరణం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.