సి ఐ బాబి పర్యవేక్షణలో 11.5 కిలోల గంజాయి పట్టివేత… ఆరు మంది గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్…2 మోటార్ బైకులు,4 సెల్ ఫోన్లు స్వాధీనం
ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి):విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని నాయుడుపేట పట్టణ సి ఐ బాబి పర్యవేక్షణలో స్థానిక పోలీసుల అరెస్టు చేసి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డి ఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత లక్ష్యంగా ఎంచుకొని గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండున్నర లక్షల రూపాయల విలువ గల 11:30 కిలోల గంజాయిని, నాలుగు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14 మంది విద్యార్థుల తో పాటు కొంత మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు.నాయుడుపేట పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిఐ బాబి,ఎస్ ఐ ఆదిలక్ష్మి సిబ్బందిని డిఎస్పి అభినందించారు.నాయుడుపేట, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణతో పాటు విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు,కళాశాలల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయ నివారణే లక్ష్యంగా చేస్తున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట డివిజన్లో గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయ దారుల వివరాలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు.