ప్రభాతదర్శిని (ఖానాపూర్-ప్రతినిధి):నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్, ఎం ఏ రజాక్, ఆదేశాల మేరకు పెంబి, ఖానాపూర్, మండలల్లోని పెంబి తండా, ఇటిక్యాల, ఇటిక్యాల తండా, సేవా నాయక్ తండాల్లో, ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఐదు లీటర్ల నాటు సారాయి 320 కేజీల నల్ల బెల్లం 35 కేజీల పట్టికని స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై వసంతరావు, తెలిపారు నాటు సారాయి తయారుచేసిన విక్రయించిన నాటు సారాయి తయారికి సంబంధించిన ముడి పదార్థాలు నల్ల బెల్లం పట్టిక అమ్మిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు, ఈ దాడుల్లో నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై వసంతరావు, అదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అక్బర్ హుస్సేన్, నిర్మల్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సింధు, బైంసా ఎక్సైజ్ ఎస్సై గజేందర్, మరియు సిబ్బంది వెంకటేష్, రవీందర్, గౌతమ్, కల్పన, తేజ, పాల్గొన్నారు.