ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట- ప్రతినిధి) ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 సంవత్సరాలు సీఎం గా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఒక మెడికల్ కాలేజీని కూడా తేలేకపోయారని, పేదలకు ఉచిత వైద్య విద్య మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలో నిర్మాణం చేపట్టారు అని తెలిపారు అందులో ఐదు కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరో రెండు కాలేజీలు ప్రారంభ దిశలో ఉన్నాయి మిగిలిన పది కాలేజ్లను ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి వాటిని ప్రైవేటుపరం చేయాలనుకోవడం బాధాకరమైన తెలిపారు పేదల పట్ల కూటమి ప్రభుత్వం తక్కువ చూపు చూస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దాలి సోమశేఖర్ రెడ్డి. పెళ్లకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి.పెళ్లకూరు జడ్పిటిసి నన్నుo ప్రిష్కిల్ల నాయుడుపేట ఎంపీపీ కొరగొండ్ల ధనలక్ష్మి.పాదర్తి హరినాథ్ రెడ్డి.ఓట్టురు కిషోర్ యాదవ్.పెళ్లకూరు మండల కన్వీనర్ వెంకటరత్నం కలికి మాధవరెడ్డి.తమ్మి రెడ్డి.తంబి రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి.నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక.కటకం జయరామయ్య.మునస్వామి నాయుడు. రాహుల్ రెడ్డి. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.