
ప్రశ్నించినా, సహకరించక పోయిన బెదిరింపులు! నిగ్గు తేలని విషయాలు ఎన్నెన్నో !
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో క్వారీ లీజును అక్రమంగా పొందిన సంఘటన పెద్ద సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో రాజకీయ మరియు వివిధ శాఖల తో గల పరిచయాలు మరియు లోపలి అవినీతి వలన లాభం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యక్తి చట్ట విరుద్ధంగా క్వారీ ని సంపాదించి, అనధికారికంగా గ్రానైట్ బ్లాకుల తవ్వకం మరియు రవాణా కార్యకలాపాలలో పాల్గొనడం వలన పర్యావరణ హానికీ, చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనకూ కారణమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులు స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ లీజు సరిగ్గా కేటాయించబడలేదు. కేవలం గత ప్రభుత్వ ప్రముఖ రాజకీయ నేతల మరియు ఆ సమయంలో శాఖాధికారులతో ఉన్న సంబంధాల ద్వారా ఈ లీజు పొందినట్లు తెలుస్తోంది. ఈ చర్యలు చట్ట వ్యతిరేకంగా మరియు పర్యవేక్షణ లేకుండా జరిగిన సమయంలో చోటుచేసుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో స్థానిక అధికారులచే సర్వే, తనిఖీలు ప్రారంభించినప్పుడు, అధికారులు బెదిరింపులకు గురయ్యారని స్థానికులు అనుకుంటున్నారని సమాచారం. ఇది కాకుండా లీజు దారునికి అనుకులంగా నివేదిక ఇవ్వని అధికారుల మీద కొన్ని తప్పుడు కథనాలు గత ప్రభుత్వం అనుకూల వార్తాపత్రికలో ప్రచురించబడ్డాయని, ఇలా తప్పడు వార్తలు వ్రాయించడంలో స్టానిక అధికారి పాత్ర కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఇవి తనిఖీ బృందాల నమ్మకాన్ని తగ్గించే ప్రయత్నంగా పొందించబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా అసత్య ప్రచారాలు అక్రమ కార్యకలాపాలను సమర్థించేందుకు చేయబడ్డాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలానే, క్వారీ లీజు మంజూరు విషయం లో ఆ సమయంలో ఉన్న శాఖాధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతములో లీజుదారుని భార్య పేరు మీద ఉన్న క్వారీ లీజులో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చడానికి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ క్వారీ లీజు మంజూరు చేయించి, జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకుండా చేయించారని సమాచారం. ఇది కేవలం చట్టాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, ప్రాంతీయ జీవనోపాధిని మరియు పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. లీజుదారుడు ఇప్పటి స్థానిక శాఖాపరమైన అధికారులను, ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ తో సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వంలో వారితో కలసి పనిచేసిన కొందరు ముఖ్య అధికారులు ద్వారా ప్రభావితం చేసి శాఖాపరమైన సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకుంటూ వేరు వేరు విధానాల ద్వార క్వారీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రయత్నిస్తున్నారు అని సమాచారం. ఇంకా తీవ్రతను పెంచుతూ, ప్రాంతీయ ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని నిజమైన సమస్యల నుండి మళ్లించే రాజకీయ వ్యూహంగా ఉందని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక ప్రజలు మరియు పర్యావరణ సంఘాలు తక్షణ విచారణ జరిపించి క్వారీ నిలుపుదల చేసి తగిన చర్యలు తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా ప్రజలు పర్యావరణ పరిరక్షణ మరియు న్యాయబద్ధ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై దృఢమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పౌరుల చైతన్యం మరియు అధికారుల నిజాయితీ ద్వారానే న్యాయం నిలవగలదని పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండగలదని స్థానిక ప్రజలు విశ్వసిస్తున్నారు.