తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావు
ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎన్డీయే కూటమి బిజెపి నాయకులు,తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వరప్రసాద్ రావు కమీషనర్ ఎన్ మౌర్య కు సూచించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో తుడా వైస్ చైర్పర్సన్ ,మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య ను ఎన్డీఏ కూటమి బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు,మాజీ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం తిరుపతి మున్సిపల్ పరిదిలో పెండింగ్ ఉన్న అభివృద్ది పనుల పై కమీషనర్ తో ఆయన చర్చించారు.ప్రధానంగా మున్సిపల్ కాంప్లెక్స్, మల్టీ లెవెల్ పార్కింగ్, క్రికెట్ గ్రౌండ్ లకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు పెండింగ్లో ఉన్నాయని కమీషనర్ తెలిపారు. అందుకు మాజీ ఎంపీ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల సంబంధిత మంత్రులతో మాట్లాడి త్వరగా నిధులను మంజూరు చేయించుకుని తీసుకు వస్తానని హామీనిచ్చారు. వాటితో పాటు తిరుపతి బస్టాండ్ సమీపంలో జనాభా రద్దీ ఎక్కువైపోవడంతో సిటీకి సమీపంలో మోడరన్ బస్టాండ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే వాటికి కూడా నిధులను మంజూరు చేసి తీసుకు వస్తానని మున్సిపల్ కమిషనర్ , తుడ వైస్ చైర్పర్సన్ ఎన్ మౌర్యకు వివరించారు.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కలిసినవారిలో ఆయన వెంట సత్యవేడు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, జల్లి మధుసూదన్, పెనుబాల చంద్రశేఖర్ ,పలువురు ప్రముఖ నాయకులు ఉన్నారు..