మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ తమ గోడును వెళ్ళబోసు కుంటున్నారు. తాజాగా ఒంగోలు నగరంలో బుధవారం అవినీతి తిమింగలం ఒకటి ఏ.సి.బి అధికారుల వలలో చిక్కు కున్నది. వివరాల లోకి వెళితే ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లక్ష యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టు బడ్డారు.ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేఎస్ శ్రీనివాస ప్రసాద్ పని చేస్తున్నారు. ఫిర్యాది దారుడు సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చిన సహాయ కమిషనర్ దానిపై ఫిర్యాదికి పెనాల్టి వేశారు. అయితే ఆ పెనాల్టీ లేకుండా చేయుటకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్.శ్రీనివాస ప్రసాద్ లక్ష యాభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో అంత పెద్ద మొత్తం డబ్బును అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస ప్రసాద్ కు ఇవ్వడం ఇష్టం లేని చేసి సదరు లంచం తీసుకుంటు ఉండగా, ఒంగోలు ఎసిబి డిఎస్పి పి. రామ చంద్ర రావు ఆద్వర్యంలో ఏ.సి.బి అధికారులు రెడ్ హ్యాండుగా పట్టుకొని అతని వద్ద నుండి లక్ష యాభై వేలు రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేసినారు. ఏసీబీ డీఎస్పీ పి రామచంద్ర రావు, ఇన్స్పెక్టర్ శేషు,ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్,షేక్.మస్తాన్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.