రీ వాల్యుయేషన్ లో 75 మార్కులతో ఉత్తీర్ణత బోర్డు అనాలోచిత నిర్ణయంతోమానసిక క్షోభకు గురైన విద్యార్థి
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రీ వ్యాల్యుయేషన్ దరఖాస్తు
ఒక్కోక్క సబ్జెక్ట్ లో 95 పైగా మార్కులు సాధించిన కుషాల్ కు ప్రసంశలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు అనాలోచిత, మాయాజాల నిర్ణయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. ఐదు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు చేతి వాటం చూపి ఫెయిల్ చేసి, మానసిక క్షోభకు గురి చేసిన సంఘటన తిరుపతి జిల్లా చోటు చేసుకుంది. ప్రతిభ కనపరచే విద్యార్థి ఎలా ఫెయిల్ అవుతారన్న కనీస ఆలోచన చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా అధికారుల పొరపాటు లెక్కలు బయటపడ్డాయి. ఒక్క సబ్జెక్టులో 17 మార్కులు వచ్చేయని మొదట పేర్కొన్న బోర్డు, రీవాల్యుయేషన్ తర్వాత ఏకంగా ఆ మార్కులను 75 వచ్చే అంటూ రెండోవ సారి పేర్కొనడం గమనార్హం. ఈ ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పరిమళ లక్ష్మీ బాలాజీ, శశికళ దంపతుల కుమారుడు కుషల్ శ్రీనివాస్ 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరిచి అన్ని సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించారు. తెలుగులో 96, ఇంగ్లీషులో 98 సోషల్ లో 93 మ్యాథ్స్, సైన్స్ లో 100 కి 100 మార్కులు సాధించారు అయితే ఒక హిందీలో మాత్రం 75 మార్కులు సాధించిన ఎస్ఎస్సి బోర్డు నిర్వాకంతో కేవలం 17 మార్కులు సాధించి ఫెయిల్ అయినట్లు ఫలితాలను వెల్లడించారు. దీంతో విద్యార్థి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. విద్యార్థి ఆందోళన గమనించిన తల్లిదండ్రులు సర్థి చెప్పారు. విద్యార్థి చదువుపై ఉన్న నమ్మకంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. రీ వాల్యుయేషన్ అనంతరం విద్యార్థికి హిందీలో 17 మార్పులు బదులుగా 75 మార్కులు పొందుపరిచి ఆ విద్యార్థిని పాసైనట్లు ఫలితాలు వెల్లడించారు. దీంతో విద్యార్థితో పాటు తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చదువులో రాణించే విద్యార్థి ఇలాంటి తప్పుడు ఫలితాలతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఉంటే ఎవరు బాధ్యులు అని ఆ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకుండా ఎస్ఎస్సి బోర్డు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 60 శాతం మార్కులు పైగా అన్ని సబ్జెక్టుల్లో వచ్చి ఒకటి రెండు సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చి ఉంటే ఆ విద్యార్థి ఫలితాలు తాత్కాలికంగా నిలిపి మరోసారి పునః పరిశీలించాక విద్యార్థుల ఫలితాలను వెల్లడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారు. ఆ దిశగా ఎస్ఎస్సి బోర్డు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.