• 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా
• హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు
• పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది
• గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు
• సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా
• సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేసిన హిమాన్షు శుక్లా
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గం.లకు ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాన్షు శుక్లా ఐ అండ్ పీఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా రావడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు ఐ అండ్ పీఆర్ (సమాచార పౌర సంబంధాల శాఖ) అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాన్షు శుక్లాకు ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్, తేళ్ల కస్తూరి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, ఓ.మధుసూధన, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు, సి.వి. కృష్ణారెడ్డి, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం.భాస్కర్ నారాయణ, జీవీ. ప్రసాద్, వెంకటరాజు గౌడ్, ఎఫ్ డీసీ జనరల్ మేనేజర్, శేష సాయి, ఐ అండ్ పీఆర్ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.