ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి):మణికొండ మున్సిపాలిటీ జలమండ జిల్లాలి మేనేజర్‌ లంచం తీసుకుంటూ పట్టుబద్దారు . అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు డివిజన్‌-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనానికి రెండు కొత్త నీటి కనెక్షన్‌లు తీసుకునేందుకు అధికారులను కోరాడు. దీంతో మేనేజర్‌ స్పూర్తిరెడ్డి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ ద్వారా సదరు వ్యక్తి నుంచి రూ. 30 వేల లంచం డిమాండ్‌ చేశారు. అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్‌ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షన్‌కు అనుమతులు ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో. మంగళవారం జలమండలి మేనేజర్‌ స్ఫూర్తిరెడ్డి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి పై కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.