ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్పేరు వైన్ షాప్ కూడా ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చబడింది. ఈ ఘటనపై క్రైమ్ నంబర్లు 32/25 మరియు 33/25 కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, 22 (180 మిల్లీ లీటర్ల) మద్యం సీసాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.