ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే ప్రిస్కీల్లా గోల్డ్ మెడల్ అందుకున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఆత్మీయుల సమక్షంలో ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ ను అందుకున్నారు. పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి గ్రామానికి చెందిన మంగళపూరి ప్రిస్కీల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ సాధించడం ద్వారా ఓజిలి మండలం కీర్తి ప్రతిష్టలు విద్యారంగంలో నిలిపారు. ఓజిలి గ్రామానికి చెందిన మంగళపూరి మనోహర్ రవికుమారి దంపతుల రెండవ కుమార్తె అయిన ప్రిస్కీల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి. చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకున్న ప్రిస్కీల్లా ఎల్కేజీ నుండి చదువులో చురుకైన విద్యార్థిని గా ఉపాధ్యాయుల చేత ప్రశంసలు పొందారు.ఆమె తల్లి రవికుమారి ప్రభుత్వం ఉపాధ్యాయురాలుగా, తండ్రి మనోహర్ ఫాస్టర్ గా పనిచేసేవారు. ప్రిస్కీల్లా తన విద్యాభ్యాసాన్ని ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ఉన్న హరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఎల్కేజీ నుండి ప్రారంభమై సెకండ్ క్లాస్ వరకు కొనసాగింది. తరువాత 3వ తరగతి నుంచి 6 వరకు నాయుడుపేట లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనూ, 7వ తరగతి నుంచి 10 వరకు గూడూరు లోని ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొనసాగింది. చదువుల తల్లిగా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రిస్కిల్లా 2013లో 9.2 జిపిఏతో పదో తరగతిలో ఉత్తీర్ణత అయింది. 2015 సంవత్సరంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లో బైపిసి గ్రూపు నుండి 91% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించారు. 2019 సంవత్సరంలో గూడూరు డి ఆర్ డబ్ల్యు మహిళ కళాశాలలో బిఎస్సి (బిబిసి) 9.06 జిపిఏతో ఉత్తీర్త సాధించారు. 2021 సంవత్సరంలో ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ) 9.83 జిపిఏ విక్రమ సింహపురి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టుగా రికార్డ్ పొంది బుధవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రిస్కిల్లా తండ్రి మనోహర్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తండ్రి మరణంతో కుంగిపోకుండా తన సోదరుడైన ఫ్రాంక్లిన్ ఆమెలోని ప్రతిభాను చూసి, మరింతగా ప్రోత్సహించాడు. గత నెలలో తన అన్న ఫ్రాంక్లిన్, ప్రిస్కిల్లా కు కనీవినీ ఎరుగని రీతిలో వివాహం జరిపించారు. వివాహ సంబరంలో మునిగితేలుతున్న ఫ్రాంక్లిన్ కుటుంబం తన సోదరికి బయో టెక్నాలజీలో గోల్డ్ మెడల్ రావడం మరింత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ప్రిస్కిల్లా కు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ అందుకోవడంపై, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే గోల్డ్ మెడల్ అందుకున్న ప్రిస్కీల్లా
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more