ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాలువలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి వర్షాకాలంలో ఉరిబిండివారి కండ్రిగ మూలకట్టు సంగాలలో వరద నీరు చేరకుండా నియంత్రిస్తానన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మొత్తలు, కొరుటూరు వయా సోమరాజుపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జగంవారి దరువు గ్రామ శ్మశాన రహదారితో పాటు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కలిపిస్తానని హామీ యిచ్చారు. వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2,000 కు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఇకపై వికలాంగులకు 6 వేలు యిస్తామన్నారు.పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిషత్తు గ్యారెంటీ అనే సంక్షేమ పధకాల ప్యాకెజ్ రూపొందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు సిలెండరుర్లు ఉచితంగా అందచేస్తారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్ధత చంద్రబాబు నాయుడు గారికే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ముస్లింలకు ఇస్తున్న రంజాన్ తోఫా, హిందూ, మరియు క్రిస్టియన్లకు ఇస్తున్న సంక్రాతి, క్రిస్మస్ కానుకలు కొనసాగిస్తామన్నారు. ముస్లింలకు గతంలో ఇస్తున్న దుల్హన్ పధకాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనసాగిస్తామని హామీ యిచ్చారు. మీరందరు సైకిల్ గుర్తు పై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వలసిందిగా ప్రశాంతి రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యం… కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more