ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2024 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తాం, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.