ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేశ్చంద్ర వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. పిటిషనర్ వాదనలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది….
ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లరాజీనామాలను ఆమోదించవద్దు
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more