ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): వినియోగదారులపై భారం పడకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్, సన్ ప్లవర్ ఆయిల్, ఎర్రగడ్డలు, టమోటాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని హోల్ సేల్, రిటైల్ వర్తకులతో మాట్లాడి ఇన్వాయిస్ ధరకే పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసి ఎటువంటి ఆదాయం లేకుండా ఉత్పత్తి ధరకే ప్రజలకు అందేలా చూడాలన్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దుకాణాల్లో పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తో పాటు ఉల్లిపాయలు, కందిపప్పు, మినప్పప్పు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ధరల పెరుగుదల సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను మోసం చేయకుండా ఖచ్చితమైన తూకం అందించేలా తూనికల కొలతల శాఖల అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. హోల్ సేల్, రిటైల్ ట్రేడర్లు కూడా ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరమణ, మార్కెటింగ్ ఎడి అనిత, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఐజాగ్, సివిల్ సప్లయిస్ డిఎం లక్ష్మీ నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు: నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్
Related Posts
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు…నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరిక
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని, అదేవిధంగా…
Read moreపారదర్శకంగాఎన్నికల కౌంటింగ్ : తిరుపతి జిల్లా కలెక్టర్…హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలుపారు. ఎలాంటి అవాంచనీయ హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్…
Read more