బుచ్చిరెడ్డి పాళెం లో 70 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇఫ్కో కిసాన్ సెజ్ టాటా గ్రూప్ 6 వేల 675 కోట్లతో పవర్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం నాగాయగుంట పంచాయతీలో దాదాపు 70 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనందుకు విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 20 నెలల్లో నాగాయ గుంటలో గ్రామంలో 30 లక్షల 50 వేల వ్యయంతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్, మరో 15 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా మరో 9 లక్షలు, జడ్పీ నుంచి 5 లక్షలు గ్రామాభివృద్ధికి వెచ్చించామన్నారు. అలాగే 15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు (ఉపాధి హామీ పథకం) సిమెంట్ రోడ్లకు కేటాయించామన్నారు. కొత్త కొండూరు పాలెంలో 15 లక్షలు సాగునీటి కొరకు బావి మంజూరు చేయించి రైతులకు సాగునీటి అవసరాలు తీర్చమన్నారు. నాగయ్యగుంట పంచాయతీ పరిధిలో సీఎంఆర్ఎఫ్ కింద 5 లక్షలు మంజూరు చేయించి అనారోగ్య బాధితులను ఆదుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తట్టెడు మట్టికి నోచుకుని నాగాయ గుంట పంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 70 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటే అది కూటమి ప్రభుత్వ నిబద్ధతగా అభివర్ణించారు. పంచాయతీ భవన నిర్మాణానికి 32 లక్షల రూపాయల ప్రతిపాదనలతో మంజూరు కొరకు జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగిందని నిధులు మంజూరయ్యాక పంచాయతీ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి సహకారంతో 8 కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం రహదారి విస్తరణ చేపట్టనున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రస్తావించారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఇటీవలే 6 వేల 675 కోట్లతో టాటా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులుచ్చింది. 200 ఎకరాలు కూడా కేటాయించిందన్నారు. టాటా పవర్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయన్నారు. అనంతరం 20 నెలల కూటమిపాలనలో అమలు చేసిన దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, మత్స్యకార సేవలో సంక్షేమ పథకాలు తదితర సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి అగ్రికల్చర్ బ్యాంక్ చైర్మన్ ఏటూరి శివరామకృష్ణారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు బత్తల హరికృష్ణ, చేనేత సంఘ నాయకులు కె వి శేషయ్య, స్థానిక టిడిపి నాయకుడు చెంచయ్య, చందు, నారాయణ, హజరతయ్య మరియు జనసేన బిజెపి నాయకులు చప్పిడి శ్రీనివాసులు, చిలక మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

